Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో బిగ్ ట్విస్ట్

పుష్ప -2 ప్రీమియర్ రోజు జరిగిన సంఘంటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, అదే సమయంలో తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ‘పుష్ప 2’ ప్రీమియర్ షోకు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మీకతో పాటు చిత్ర యూనిట్ వస్తున్నట్లు పోలీసుల అనుమతి కోరారు సంధ్య థియేటర్ యాజమాన్యం.ఇంతవరకు బాగానే ఉంది కానీ అల్లు అర్జున్, రష్మీక మందన్న ప్రీమియర్ షోకు రావడం వలన ఫ్యాన్స్ తో పాటు క్రౌడ్ విపరీతంగా వస్తారని, పుష్ప -2 యూనిట్ ను రావొద్దని సూచించండని థియేటర్ యాజమాన్యానికి రాత పూర్వకంగా సమాచారం ఇచ్చారట చిక్కడపల్లి పోలీసులు.

అందుకు సంభందించిన లెటర్ ను తాజగా విడుదల చేసారు. కానీ పోలీసుల మాటలను బేఖాతరు చేస్తూ సంధ్య థియేటర్ కు వచ్చి, అనుమతి లేకుండా భారీ ర్యాలీ చేపట్టాడు హీరో అల్లు అర్జున్. దీంతో అభిమానులు బన్నీని చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ప్రీమియర్ షో నుండి వెళ్తూ కూడా అల్లు అర్జున్‌ కారు ఎక్కి ర్యాలీగా అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లాడని రిమాండ్ వాదనల సమయంలో ఇదే అంశాన్ని కోర్టుకు తెలిపారు పీపీ. హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా బయటికి వచ్చారు అల్లు అర్జున్. పోలీసులు రిలీజ్ చేసిన లెటర్ తో అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి .

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *