- తండ్రి, కొడుకులుగా డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్
- బొమ్మరిల్లు, ఆకాశమంతలో తండ్రి పాత్రలకు జీవం పోసిన ప్రకాష్ రాజ్
- లవ్ మాక్ టైల్ సిరీస్‌లతో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో
ప్రకాష్ రాజ్ ఏ రోల్ చేస్తే అందుకు తగ్గట్టుగా ఒదిగిపోయే నటుడాయన. అందుకే అతడ్ని విలక్షణ నటుడు అంటారు. వెండితెరకు దొరికిన అతికొద్ది మెథడారిస్టుల్లో ఆయన ఒకరు. అందులో నో డౌట్. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాదు నాన్న పాత్రకు జీవం పోసి రెప్యూటేషన్ పెంచాడు. బొమ్మరిల్లులో తండ్రి అయినా ఆకాశమంతలో కూతుర్ని అమితంగా ప్రేమించే ఫాదరైనా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో కొడుకులు మంచి నేర్పించిన నాన్నైనా అక్కడ ప్రకాష్ రాజ్ కనిపించడు. ఫాదర్ మాత్రమే కనిపిస్తాడు. అంతలా క్యారెక్టర్‌లో ఇన్వాల్వై మనల్ని ఇన్వాల్ చేస్తాడు ఈ సీనియర్ యాక్టర్.
ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో తండ్రి పాత్రలో మెప్పించిన ప్రకాష్ రాజ్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై బాధ్యతయుతమైన నాన్నగా కనిపించబోతున్నాడు. కన్నడలో ఫాదర్ అనే మూవీలో టైటిల్ రోల్ చేస్తున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్. లవ్ మాక్ టైల్ సిరీస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్ కృష్ణ ఇందులో హీరో. కబ్జా డైరెక్టర్ ఆర్ చంద్రు తన కొత్త బ్యానర్ ఆర్ సి స్టూడియోస్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఫాదర్ మూవీ మోషన్ పోస్టర్ ను స్టార్ హీరో సుదీప్ లాంచ్ చేశాడు. నీ కోసం ప్రతిదీ త్యాగం చేసే ఒకే వ్యక్తి నాన్న ఇట్స్ ఎమోషన్ జర్నీ అంటూ బెంచ్‌పై కూర్చున్న ప్రకాష్ రాజ్‌ను చూపించారు. చూస్తే ఇది ఫక్తు ఫాదర్ అండ్ సన్ రిలేషన్ బాండింగ్ సినిమాలా కనిపించబోతుంది. డార్లింగ్ కృష్ణ, అమృత గతంలో లవ్ మాక్ టైల్‌తో హిట్టు అందుకున్నారు. ఈ నాన్న రోల్ ప్రకాష్ రాజ్‌కు బొమ్మరిల్లు, ఆకాశమంతలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుందా చూడాలి.