నందమూరి బార్న్ కింగ్ బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సాలిడ్ మాస్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ బాలయ్యకి మరో హ్యాట్రిక్ సినిమాకి మొదలుగా నిలవాలి అని కోరుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా యూఎస్ బుకింగ్స్ కి సంబంధించి ఇపుడు అప్డేట్ తెలుస్తుంది.
డాకు మహారాజ్ లేటెస్ట్ గా యూఎస్ లో బుకింగ్స్ ని ఓపెన్ చేసుకుందట. ప్రస్తుతానికి 29 ప్రాంతాల్లో 77 షోలకి సంబంధించి బుకింగ్స్ మొదలయ్యాయి. ఇక నెక్స్ట్ మరిన్ని ప్రాంతాలు బుకింగ్స్ ఓపెన్ కానున్నట్టు తెలుస్తుంది. ఇలా మొత్తానికి మాత్రం డాకు మహారాజ్ యూఎస్ మార్కెట్ లో మంచి ఓపెనింగ్స్ ని అందుకునే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా జనవరి 12న సినిమా రిలీజ్ కి రాబోతుంది.
The post యూఎస్ లో “డాకు మహారాజ్” బుకింగ్స్ మొదలు.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.