అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులు సెట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికి వరల్డ్ వైడ్ గా రు. 1409 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప -2. తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా బాలీవుడ్ లో ఎక్కువ వసూళ్లు రాబట్టింది పుష్ప -2.
అటు ఓవర్సీస్ లోను సూపర్బ్ స్టార్ట్ అందుకుంది పుష్ప. కేవలం అడ్వాన్స్ సేల్స్ రూపంలోనే 3 మిలియన్ కు పైగా రాబాట్టింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో పుష్ప తన సత్తా చాటింది. అయితే అక్కడ కూడా హింది ఆడియెన్స్ డామినేషన్స్ ఎక్కువగా ఉంది. తెలుగు లాంగ్వేజ్ కంటే ఎక్కువ హిందీ లాంగ్వేజ్ కు భారీ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ చుస్తే $13 రాబట్టింది. కానీ ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే భారీ టార్గెట్ ను ఎచీవ్ చేయాల్సి ఉంది. పరిస్థితులు చూస్తుంటే కొంచం అటు ఇటు అయ్యేలా ఉందట. సెకండ్ వీక్ కలెక్షన్స్ చుస్తే ఆ విషయం క్లియర్ గా తెలుస్తోంది. దానికి తోడు క్రిస్మస్ కు హాలీవుడ్ లో భారీ సినిమాల రిలీజ్ ఉండడం కూడా పుష్ప కు కాస్త ఇబ్బంది అవుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. రెండవ వీక్ లో కాస్త వీక్ అయిన పుష్ప ఫైనల్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి.