ఆర్ఆర్ఆర్ : బిహైండ్ & బియాండ్ ట్రైలర్.. ఇండియన్ నుంచి గ్లోబల్ జర్నీ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరోలు జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇక ఈ సినిమాను పీరియాడిక్ ఫిక్షన్ మూవీగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన తీరుకి యావత్ సినీ లవర్స్ నీరాజనాలు పలికారు.

దీంతో ఈ మూవీ ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఈ సినిమా కోసం రాజమౌళి అండ్ టీమ్ ఎంత కష్టపడ్డారు.. అసలు ఈ సినిమా ఔట్‌పుట్ వెనకాల ఉన్న శ్రమ ఎలాంటిది అనే విషయాలను ఇప్పుడు మనకు ఓ డాక్యుమెంటరీ రూపంలో చూపెట్టనున్నారు. దీనికి సంబంధించి ‘ఆర్ఆర్ఆర్ – బిహైండ్ & బియాండ్’ అనే ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో రాజమౌళితో పాటు హీరోలు తారక్, చరణ్‌లు ఈ సినిమా కోసం ఎంత శ్రమించారో మనకు చూపెట్టారు.

వారితో పాటు చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్లు ఈ సినిమాను ఇండియన్ ఒరిజిన్ నుంచి గ్లోబల్ రీచ్ వరకు ఎలా తీసుకెళ్లేందుకు కష్టపడ్డారో మనకు ఇందులో శాంపిల్‌గా చూపెట్టారు. ఇక ఈ బిహైండ్ ది సీన్స్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో, దీనికి సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The post ఆర్ఆర్ఆర్ : బిహైండ్ & బియాండ్ ట్రైలర్.. ఇండియన్ నుంచి గ్లోబల్ జర్నీ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *