- మోహన్‌బాబు ఫ్యామిలీ గన్స్ సీజ్ చేసిన పోలీసులు
- ఫిలింనగర్ పీఎస్‌లో గన్ సీజ్ చేసిన పోలీసులు
- ఇప్పటికే ఒక గన్‌ను చంద్రగిరిలో సరెండర్
మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే వారి కుటుంబ వివాదం మీద పోలీసు కేసులు కూడా నమోదు అయ్యాయి. మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే తాజాగా మోహన్ బాబు వద్ద గన్ లు చంద్రగిరిలో ఉన్నపుడు తీసుకున్నాడని, రాచకొండ నుండి ఎలాంటి పర్మిషన్ గన్స్ లేవని రాచకొండ సీపీ వెల్లడించారు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నాయని, ఒక డీబీపీఎల్, మరొకటి స్పానిష్ మేడ్ గన్ ఉందని అన్నారు. అయితే తాజాగా మోహన్ బాబు ఫ్యామిలీ గన్స్ సీజ్ చేశారు పోలీసులు. మోహన్ బాబుకి చెందిన మరో గన్ సీజ్ చేశారు పోలీసులు. ఫిలింనగర్ పీఎస్‌లో మరో గన్ సీజ్ చేశారు పోలీసులు. ఇప్పటికే ఒక గన్‌ను చంద్రగిరిలో సరెండర్ చేశారు మోహన్ బాబు.
Sritej: శ్రీ తేజ్ బ్రెయిన్ డామేజ్.. రికవరీకి మరింత సమయం!!
ఇప్పుడు మరో గన్‌ను ఫిలింనగర్ పీఎస్‌లో సరెండర్ చేశారు మోహన్‌బాబు. అలా మొత్తం మీద రెండు గన్స్ పోలీసులకు అప్పగించినట్టు అయింది. అయితే తాజాగా మంచు మనోజ్ ఇంట్లో జనరేటర్ లో మంచు విష్ణు చక్కెర పోసాడని ఆరోపిస్తూ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. అయితే మంచు మంచు మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో ఆయన తల్లి మంచు నిర్మల పహాడీ షరీఫ్ పోలీసులకు వివరణ ఇస్తూ తాజగా లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో నిర్మల మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజీని బయట పెట్టి, దాన్ని విష్ణు గొడవ చేసినట్లు లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినట్లు తెలిసిందని, అది నిజం కాదని చెప్పుకొచ్చారు.