GameChanger : గేమ్ ఛేంజర్ లో ఆ రెండు బ్లాక్ లు ఫ్యాన్స్ కు పూనకాలే

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ అంచ‌నాల న‌డుమ 2025లో విడుద‌ల‌వుతున్న పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న విడుద‌ల‌వుతుంది. విడుద‌ల తేది ద‌గ్గ‌ర‌వుతున్న కొద్ది సినిమాపై అంచనాలు రోజురోజకి పెరిగిపోతున్నాయి. రామ్ చరణ్ మాస్ యాక్షన్ ను వెండితెరపై చూసేందుకు అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

also read : Chiranjeevi : అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..?

కాగా ఈ సినిమాలోని ఓ రెండు బ్లాకుల గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మొత్తం 2 గంటల 50 నిమిషాల రన్ టైమ్ తో వస్తున్న గేమ్ ఛేంజర్ లో ఇంట్వర్వెల్ బ్లాక్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. ఈ ఎపిసోడ్ లో చరణ్ స్టైలిష్ యాక్షన్ ను థియేటర్స్ లో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారెంటీ అని వినిపిస్తోంది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కు ఆడియెన్స్ షాక్ అవడం పక్కా అని ఈ రెండు ఎపిపోడ్స్ ను సినియాను ఓ రేంజ్ లో నిలబెడతాయని గట్టిగా వినిపిస్తుంది. ఈ ప్రచారం ఎంత వరకు నిజమనేది మరికొద్ది రోజుల్లో తేలుతుంది. ఇదిలా ఉండగా ‘గేమ్ చేంజర్’ సినిమాను త‌మిళంలో ఎస్‌వీసీ, ఆదిత్య రామ్ మూవీస్ విడుద‌ల చేస్తుండ‌గా హిందీలో ఏఏ ఫిల్మ్స్ అనీల్ త‌డానీ విడుద‌ల చేస్తున్నారు. డిసెంబ‌ర్ 21న యు.ఎస్‌లోని డ‌ల్లాస్‌లో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ క‌ల్లెప‌ల్లి ఆధ్వ‌ర్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *