ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమా నుంచి వచ్చి మంచి హిట్ గా అంతకు మించి ఆడియెన్స్ మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ఏది అంటే అది ఖచ్చితంగా “లాపత లేడీస్” అని చెప్పాలి. ఈ చిత్రాన్ని దర్శకుడు కిరణ్ రావు తెరకెక్కించగా రేస్ గుర్రం విలన్ రవి కిషన్ అలాగే ప్రతిభ రంత, నితాన్షి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమా అందుకున్న విజయంలో మన దేశం నుంచి ప్రఖ్యాత అవార్డు ఆస్కార్స్ నామినేషన్ కి మన దేశం తరపున అఫీషియల్ ఎంట్రీగా ఈ సినిమాని కూడా పంపించారు. అయితే ఇపుడు ఈ సినిమా ఈ రానున్న 2025 ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకోలేకపోయింది.
లేటెస్ట్ గా 10 కేటగిరీ లకి సంబంధించి ఆస్కార్ అకాడమీ వారు షార్ట్ లిస్ట్ అయ్యిన సినిమాలు పొందుపరిచారు. మరి వీటిలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో “లాపత లేడీస్” కి చోటు దక్కలేదు. దీనితో ఆస్కార్ బరి నుంచి ఈ సినిమా తప్పుకుంది. దీనితో అభిమానులు కొంచెం డిజప్పాయింట్ అయ్యారు.
The post ఆస్కార్స్ నుంచి తప్పుకున్న “లాపత లేడీస్” first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.