రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

Anasuya: సినిమాలు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటి అనసూయ (Anasuya) ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనపై ఓ నెటిజన్ చేసిన కామెంట్ పై ఆమె స్పందించారు. గౌరవప్రదమైన విమర్శలు తాను తీసుకుంటాను కానీ.. కావాలని చేసే విమర్శలపై సహించేదిలేదని స్పష్టం చేశారు.

‘నా మానసిక ప్రశాంతత దృష్ట్యా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విమర్శ గురించి పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నా. నాలుగేళ్ల క్రితం మహానటి సావిత్రమ్మకు నివాళిగా జరిగిన ఓ కార్యక్రమంలో నేనో ప్రదర్శన ఇచ్చాను. అందులో నా నటన, డ్యాన్స్ ను ట్రోల్ చేయడం.. అవహేళన చేసే విధంగా విమర్శ చేయడం బాధాకరం. ఇది నా గురించి చెప్పట్లదు’.

‘ఓ మహానటికి నివాళి ఇచ్చే క్రమంలో చేసిన నటనను వక్రీకరించడం అంటే వారిని అవమానించినట్టే. మీరు కావాలంటే కార్యక్రమం మొత్తం చూసి ఓ నిర్ణయానికి రండ’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అనసూయ పుష్ప2, ఫ్లాష్ బ్యాక్, ఓల్ఫ్ సినిమాల్లో నటిస్తున్నారు.