Nag Ashwin: నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నటించిన కల్కి (Kalki 2898 AD) రూ.1000కోట్లు వసూలు చేసినట్టు చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ నాగ్ అశ్విన్ చేసిన పోస్టుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

‘ఇంతటి కలెక్షన్లు మాలాంటి యంగ్ టీమ్ కు ఉత్సాహాన్నిస్తోంది. రక్తం, హింస, అశ్లీలత, రెచ్చగొట్టడం, పేలుడు, దోపిడీ.. వంటి సన్నివేశాలు లేకుండా సాధించాం. చిత్రంలోని నటీనటులుమ ప్రేక్షకులకు ధన్యవాదాల’ని పోస్ట్ చేశారు. నాగ్ అశ్విన్ పోస్ట్ ‘యానిమల్’తో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ను ఉద్దేశించేనని కామెంట్స్ వస్తున్నాయి.

‘అన్ని సినిమాలూ ఒకేలా ఉండవు.. అందరి దర్శకుల విజన్ ఒకేలా ఉండదు. నీవు 1000 కోట్ల పోస్టర్ వేసుకున్నట్టు 930కోట్లు వచ్చిన యానిమల్ 1000కోట్ల పోస్టర్ వేసుకోలేదు. నీ సినిమాను ఆదరించిన ప్రేక్షకులే ‘యానిమల్’ను ఆదరించారు. నువ్వు మాత్రమే పురాణాలను ఔపోసనపట్టి సినిమా తీశావ్ అనుకుంటే ఎలా. ఎలాంటి సినిమా తీయాలో దర్శకుడి ఇష్టం.. ఏ సినిమాను ఆదరించాలో ప్రేక్షకుల ఇష్ట’మంటూ కొందరు విమర్శిస్తున్నారు.