Darshan – Kumar : 14 ఏళ్ల తర్వాత చేతులు కలిపిన బ్లాక్ బస్టర్ జోడి

మలయాళ సినిమాలను రీమేక్ చేస్తూ బాలీవుడ్‌లో సూపర్ హిట్ దర్శకుడిగా ఛేంజయ్యాడు మాలీవుడ్ డైరెక్టర్ ప్రియదర్శన్. ఎక్కువగా అక్షయ్ కుమార్‌తో ఫన్ అండ్ ఎంటర్ టైనర్ మూవీస్ తెరకెక్కించాడు. హేరా ఫేరీతో మొదలైన పరంపర  2010లో వచ్చిన కట్టా మీటా వరకు కొనసాగింది. అక్షయ్- ప్రియదర్శన్ కాంబోలో ఇప్పటి వరకు ఆరు సినిమాలొస్తే అన్ని సూపర్ డూపర్ హిట్సే,  కానీ ఎందుకనో కట్టా మీటా తర్వాత కలిసి వర్క్ చేయలేదు.

మళ్లీ 14 ఏళ్లకు ఈ బ్లాక్ బస్టర్ జోడీ రికార్డులు సృష్టించేందుకు రెడీ అయ్యింది. మరోసారి హారర్ కామెడీతో వస్తోంది ఈ హిట్ కాంబో. ప్లాపుల్లో ఉన్న ప్రియదర్శన్‌తో కలిసి భూత్ బంగ్లా చేస్తున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్. భూత్ బంగ్లా ప్రజెంట్ సెట్స్ పైకి వెళ్లగా అప్పుడే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. రీసెంట్లీ రిలీజ్ డేట్ విషయంలో ఇతర హీరోలు, సినిమాలతో క్లాషెస్ వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలో భాగంగా అఫీషియల్ ఎనౌన్స్ చేశారు. 2026 ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.  కట్టా మీటా తర్వాత ఇటు మాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు ప్రియదర్శన్, కానీ  తన మార్క్ చూపించలేకపోయాడు. అరకొర బ్లాక్ బస్టర్స్ మూవీస్ ఉన్నాయి కానీ అవన్నీ హీరోల ఖాతాలోకి వెళ్లిపోయాయి. మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోతో మారక్కర్ చేస్తే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇదే టైంలో పిలిచి ఆఫర్ ఇచ్చాడు ఖిలాడీ హీరో. డైరీ ఫుల్ అయినప్పటికీ ఛాన్స్ ఇచ్చాడు అక్షయ్. భూత్ బంగ్లా లాంటి హారర్ కామెడీతో ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చేస్తోంది ఈ హిట్ కాంబో.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *