సిద్ధు జొన్నలగడ్డ కథాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’ ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ, ప్రేమ కథలకు పెట్టింది పేరయిన బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో సరికొత్త కొత్త జోనర్ మూవీగా జాక్ తెరకెక్కుతోంది. ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు ఎక్కడా కంప్రమైజ్ కాకుండా షూట్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్ లో 80 శాతం చిత్రీకరణ కంప్లిట్ చేసారు మేకర్స్.
Also Read : Darshan – Kumar : 14 ఏళ్ల తర్వాత చేతులు కలిపిన బ్లాక్ బస్టర్ జోడి
ఇటీవల నేపాల్ షెడ్యూల్ ముగించింది యూనిట్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది వేసవి సెలవుల కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. తమిళ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అదే రోజు ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ ది రాజా సాబ్’ కూడా రిలీజ్ కానుంది. ప్రభాస్ సినిమాతో పోటీ అంటే కాస్త రిస్క్ అనే చెప్పాలి. రాజసాబ్ ఆ రోజు రిలీజ్ కాదేమో అనే డేట్ వేసారా లేదా రిస్క్ అయిన సరే మరొక డేట్ లేక అదే డేట్ వేసారా అనే దానిపై క్లారిటీ లేదు. బేబి సినిమా ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు నిర్మాత బి.వి.ఎస్.ఎన్ . ప్రసాద్.