Published on Dec 18, 2024 2:06 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇండియా వైడ్ ఫా రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. అయితే వీటిలో హిందీ మార్కెట్ కీలక పాత్ర పోషించాయి అని చెప్పాలి. ఇలా ఒక్క ఇండియన్ సినిమా దగ్గరే కేవలం హిందీ వెర్షన్ లో పుష్ప 2 సంచలన రికార్డులు సెట్ చేస్తుంది.
ఇలా లేటెస్ట్ గా హిందీ వెర్షన్ లో ఏకంగా 600 కోట్ల క్లబ్ లోకి పుష్ప 2 చేరిపోయి సెన్సేషనల్ ఫీట్ సెట్ చేసింది. మరి నిన్న మంగళవారం 19 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం నిన్నటితో అఫీషియల్ గా 600 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో పుష్ప 2 ఇక అక్కడ ఆల్ టైం హైయెస్ట్ వసూళ్లు అందుకోబోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.