రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

Anant Ambani: ప్రస్తుతం దేశం మొత్తం మాట్లాడుకుంటున్న అంశం అంటే అంబానీ ఇంట పెళ్లి సందడి గురించే. అంగరంగ వైభవంగా.. దేశ విదేశీ ప్రముఖుల మధ్య అనంత్ అంబానీ (Anant Ambani)-రాధికా మర్చంట్ వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది. రాజకీయ, సినీ, క్రీడా, పారిశ్రామిక రంగాల నుంచి దిగ్గజాలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

వేడుకకు సంబంధించి ప్రతి సందర్భమూ ఔరా అనిపిస్తూనే ఉంది. ఈక్రమంలోనే అనంత్ అంబానీ తన స్నేహితులకు ఇచ్చిన బహుమతులు మరింత ఆసక్తికరంగా మారాయి. అత్యంత ఖరీదైన అడెమార్స్ పిగ్యూట్ బ్రాండ్ కు చెందిన వాచీలు స్నేహితులకు కానుకగా ఇచ్చారు. ఒక్కో వాచీ ధర దాదాపు 2కోట్లు ఉంటుందని అంచనా. అంబానీ కుటుంబం వీటిని ప్రత్యేకంగా సిద్ధం చేయించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ వాచీలతో బాలీవుడ్ సినీ దిగ్గజాలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్.. తదితరులు ఫొటోలకు ఫోజులిచ్చారు. మరికొందరు తాము వాచీలు పెట్టుకున్న చేతులను మాత్రం చూపిస్తూ ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ వాచీలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.