RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులు రావడంతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది.

ఇక ఈ సినిమా విడుదలై దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇంకా ఈ సినిమాకు మాత్రం అవార్డులు రావడం ఆగలేదని చెప్పాలి. తాజాగా 2023వ సంవత్సరానికి గాను ఫిలింఫేర్ సౌత్ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులలో భాగంగా పలు తెలుగు సినిమాలకు భారీ స్థాయిలో అవార్డులు రావటం విశేషం.

ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా ఏడో ఫిలింఫేర్ అవార్డులు రావడం విశేషం. మరి ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా ఈ ఏడు అవార్డులు ఏ ఏ విభాగానికి వచ్చాయి ఎవరు అందుకోబోతున్నారు అనే విషయానికి వస్తే.. ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్, ఉత్తమ డైరెక్టర్ గా రాజమౌళి, ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్. ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్, గా కీరవాణి ఈ అవార్డులను అందుకోబోతున్నారు.

ఏడు విభాగాలలో అవార్డులు..
వీరితోపాటు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ ప్రొడక్షన్ డివైన్ విభాగంలో సాబు సిరిల్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా కొమరం భీముడు సింగర్ కాలభైరవ ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఇలా ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా ఏడు విభాగాలలో ఈ అవార్డులు ఈ సినిమాకు రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.