Tollywood : నెక్ట్స్ 1000 కోట్లు కొట్టే డైరెక్టర్ ఎవరు?

ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే రేర్ ఫీట్‌ను టచ్ చేశారు ఇద్దరు దర్శకులు. ఈ రిజల్ట్ నెక్ట్స్ సినిమాలకు టార్గెట్‌గా మారింది. ఆ మార్క్ టచ్ చేసే నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు..? ఏ సినిమాలకు ఆ ఛాన్స్ ఉంది..? అనేది చూద్దాం పదండి. వంద కోట్ల క్లబ్‌లోకి సినిమా చేరితే పండుగ చేసుకునే రోజుల నుంచి వెయ్యి కోట్లు ఎచీవ్ చేసే స్థాయికి ఛేంజ్ అయ్యింది టాలీవుడ్. ఈ క్రెడిట్ రాజమౌళికే దక్కుతుంది. ఎందుకంటే.. సినిమా తీయడమే కాదు.. మార్కెట్ ఎలా చేసుకోవాలో సౌత్ ఇండస్ట్రీకి పాఠాలు నేర్పిన మాస్టర్. ఒకసారే కష్టం అనుకుంటే రెండు సార్లు వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ఘనత దర్శక ధీరుడిది. జక్కన్న వేసిన స్ట్రాటజీ చాలా మంది తెలుగు మేకర్స్ ఫాలో అయ్యారు కానీ ఎవరూ సక్సీడ్ కాలేదు. రాజమౌళి థౌజండ్ క్రోర్ కలెక్షన్స్ మార్క్ టచ్ చేసే డైరెక్టర్ ఎవరా అని ఈగర్లీ వెయిట్ చేస్తుంటే.. నాగ్ అశ్విన్ రూపంలో పుట్టుకొచ్చాడు. కల్కి 2898ఏడీతో ఈ ఏడాది వెయ్యి కోట్లను క్రాస్ చేశాడు.

Mallu Beauties: మలయాళ భామల ప్రేమలో పడ్డ టాలీవుడ్

కల్కి 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేయగా.. చివరిలో వచ్చిన పుష్ప రాజ్ ఈ నంబర్ బీట్ చేశాడు. 1500 ప్లస్ కోట్ల వసూళ్లతో ఈ ఏడాదే హయ్యెస్ట్ కలెక్షన్స్ మూవీగా నిలిచింది పుష్ప 2. సుకుమార్ టేకింగ్, అల్లు అర్జున్ మేనియాకు సినిమాపై కాసుల వర్షం కురిసింది. కొన్ని రోజులుగా అందని ద్రాక్షలా ఊరిస్తోన్న థౌంజడ్ క్రోర్ టార్గెట్ ఈ ఇయర్ ఎచీవ్ చేశారు నాగ్ అశ్విన్, సుకుమార్. ఈ రిజల్ట్ నెక్ట్స్ సినిమాలపై పడుతుందా అంటే అఫ్ కోర్స్ అనే మాటే వినిపిస్తోంది. 2025లో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ రాబోతున్నాయి. ఆ పిక్చర్లపై ఈ ఎఫెక్ట్ కనబడుతోంది. 2025లో క్యూరియాసిటీ అండ్ హైప్ పుట్టిస్తున్నాయి కొన్ని హై బడ్జెట్ సినిమాలు. వీటిపై హై ఎక్స్ పర్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ చెప్పుకోవాల్సింది గేమ్ ఛేంజర్. చెర్రీ త్రిబుల్ ఆర్‌తో వెయ్యి కోట్ల టార్గెట్ రీచ్ అయిపోయాడు. కానీ శంకర్‌కు టార్గెట్టే. కోలీవుడ్‌లో ఈఫీట్‌ను ఏ డైరెక్టర్, హీరో ఎవరు టచ్ చేయలేదు. అలాగే హరిహర వీర మల్లుతో జ్యోతికృష్ణతో పాటు పవన్ కళ్యాణ్ ముందు ఈ టార్గెట్ ఉంది. ఓజీ కూడా నెక్ట్స్ ఇయరే ప్లాన్ చేస్తున్నాడు సుజిత్. ఇక ప్రభాస్ -మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ కూడా ఈ రేసులోనే ఉంది. మరీ ఇందులో ఏ బొమ్మ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్టుగా మారి.. ఎవరు నెక్ట్స్ ధౌజండ్ క్రోర్ డైరెక్టర్‌గా అవుతారో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *