బలగం మూవీ ఫేమ్, జానపద కళాకారుడు మొగిలయ్య (67) కన్నుమూశారు. వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. బలగం సినిమాలో తన గాత్రంతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన మొగిలయ్య.. కొన్ని రోజులుగా కిడ్నీలు ఫేయిల్యూర్‌తో బాధపడిన విషయం తెలిసిందే. మొగిలయ్య స్వగ్రామం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి, నటీనటులు సంతాపం తెలిపారు.