- మలయాళంలో ఫుల్ బిజీగా అపర్ణా బాల మురళి
- రాయన్ తర్వాత తమిళంలో నో ప్రాజెక్ట్
- ఫోకస్ మొత్తం మాలీవుడ్ పైనే
స్టార్ హీరోయిన్‌గా నేమ్, ఫేమ్, ఆపర్చునిటీస్ తెచ్చుకోవాలంటే గ్లామరస్ రోల్స్ చేయనక్కర్లేదు.. దర్శకులను ఇంప్రెస్ చేసేందుకు జీరో సైజ్ మెయిన్ టైన్ అవసరం లేదని నిరూపిస్తోంది ఈ బ్యూటీ. యాక్టింగ్‌ని చించారేస్తూ ఆఫర్లు కొల్లగొడుతోంది. కానీ తనకు గుర్తింపునిచ్చిన ఇండస్ట్రీపై కాన్సట్రేషన్ తగ్గించేస్తోంది ఈ భామ. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన సూరారై పొట్రులో సుందరిగా సూర్యతో పోటీగా యాక్ట్ చేసి ఆడియన్స్ అటెంక్షన్ తన వైపు తిప్పుకున్న యాక్ట్రెస్ అపర్ణా బాల మురళి. ఆమె నటనకు జాతీయ అవార్డు కూడా పాదాక్రాంతమైంది.
అందాల ఆరబోత కన్నా కథ, తనరోల్‌కు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే ఈ అమ్మడు మలయాళంలో ఇని ఉత్తరంతో మరోసారి తనేంటో ఫ్రూవ్ చేసుకుంది. 2018 మూవీలో న్యూస్ రిపోర్టర్‌గా మరోసారి ఆకట్టుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ సెలక్టివ్ స్టోరీస్ తో దూసుకెళుతోంది. ఈ ఏడాది రాయన్, కిష్కింధ కాండం లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో పాటు రుధిరంలో కనిపించింది కేరళ కుట్టీ. అయితే తనకు జాతీయ స్థాయి గుర్తింపునిచ్చిన తమిళ ఇండస్ట్రీపై సీతకన్ను వేసినట్లు కనిపిస్తోంది. ప్రజెంట్ అమ్మడి చేతిలో మూడుప్రాజెక్టులున్నాయి. అయితే ఇవన్నీ కూడా మాలీవుడ్ సినిమాలే. లాస్ట్ ఇయర్ ఒక్కటంటే ఒక్క తమిళ మూవీతో పలకరించని ఈ కేరళ కుట్టీ ఈ ఇయర్ కూడా రాయన్‌తో హాయ్ చెప్పింది. మళ్లీ ఇప్పుడు కూడా మలయాళ చిత్రాలతోనే బిజీగా గడుపుతోంది. అయితే ఇప్పటికే కమిటైన సినిమాల కారణంగా తనకు పేరిచ్చిన కోలీవుడ్ పై కాన్సట్రేషన్ చేయలేకపోతుంది. ప్రజెంట్ ఉలా, మిండియం, పరంజుమ్, జీతు జోసెఫ్- ఆసిఫ్ అలీ కాంబోలో వస్తున్న సినిమాలో వర్క్ చేస్తోంది. ఇలా వరుసగా మలయాళ సినిమాలు చేస్తూ తమిళ ఇండస్ట్రీని సైడ్ పెట్టేసింది ఈ మగువ.