తెలుగు ప్రేక్షకులకు ప్రసాద్ బెహరా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ప్రసాద్ ‘మా విడాకులు’ అనే వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా లైంగిక వేధింపుల కేసులో ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. షూటింగ్ లో తన ప్రైవేట్ భాగాలను తాకుతున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ప్రసాద్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. అయితే గతంలోనే ప్రసాద్ తనతో కలిసి నటించిన జాను నారాయణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే తరువాత విడాకులు అయ్యాయి.
Nitin Gadkari: లివ్ ఇన్ రిలేషన్, స్వలింగ వివాహాలు సమాజానికి ప్రమాదకరం..
ఈ విషయం మీద గతంలో ప్రసాద్ స్పందించాడు కూడా. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రసాద్ తన విడాకులకు సంబంధించిన విషయాలు బయటపెట్టాడు. ప్రసాద్ మాట్లాడుతూ తొందరపడి పెళ్లి చేసుకున్నా, మేము విడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి అని అన్నారు. మాకు సెట్ అవ్వలేదు, ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదు, నేను ఆ అమ్మాయికి కరెక్ట్ కాదు అని అన్నారు. ఈ విషయాన్ని ఆ అమ్మాయే ముందు రియలైజ్ అయ్యింది కానీ నెమ్మదిగా నాకు కూడా విషయం అర్థమయ్యింది. నాకు ఆ లవ్ అది ఉండడంతో నేను కొద్దిగా లేట్‌గా రియలైజ్ అయ్యా, కానీ ఆ అమ్మాయి చాలా ప్రాక్టికల్‌గా ఉంటుందని అన్నారు. మేము విడిపోయి రెండేళ్లు అవుతుందన్న ప్రసాద్ విడాకులు మాత్రం రీసెంట్గా వచ్చాయని అన్నారు. పెయిన్ చాలా ఉంటుంది కానీ అది తట్టుకుంటేనే సక్సెస్ చూడగలము అని అన్నారు. నేను బాధను తట్టుకోవడానికి ఖాళీ లేకుండా పని చేస్తున్నా, ఎవరు చనిపోయినా, ఎవరు పెళ్లి చేసుకుంటున్నా ? వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నానని అన్నారు.