Sukumar : శ్రీ తేజ్ ను పరామర్శించిన సుకుమార్

పుష్ప సినిమా ప్రీమియర్ సిమ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా రేవతి అని మహిళా చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీ తేజ్ అనారోగ్య పరిస్థితుల కారణంగా ప్రస్తుతానికి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే అల్లు అర్జున్ లీగల్ కారణాలతో సందర్శించలేకపోయిన నేపద్యంలో నిన్న అల్లు అరవింద్ వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వచ్చారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడి, తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. ఇక ఈరోజు డైరెక్టర్ సుకుమార్ కూడా కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.

Prasad Behara: ప్రసాద్ బెహరాకి నటితో పెళ్లి, విడాకులు.. బ్రేకప్ స్టోరీ తెలుసా?

శ్రీతేజ్ కి మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లను కలిసి ఆయన శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు సుకుమార్ భార్య గతంలోనే రేవతి భర్తను కలిసి 5 లక్షల రూపాయలు చెక్ అందించినట్లుగా తాజాగా వెల్లడైంది. ఇక లీగల్ వ్యవహారాల పూర్తయితే అల్లు అర్జున్ కూడా బాలుడిని పరామర్శించే అవకాశం కనిస్తోంది. ఇక బాలుడు అల్లు అర్జున్ వీరాభిమాని కావడంతో తండ్రి సినిమా టికెట్లు సంపాదించి సినిమాకి తీసుకెళ్లారు. కానీ అనూహ్యంగా తొక్కిసలాట ఏర్పడి రేవతి చనిపోగా ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *