భారీ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ శంకర్. ఆయన మూవీలు కమర్షియల్ గా భారీగా ఉండటమే కాక.. సందేశాత్మకంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ పనులతో బిజీగా ఉన్నారు. ఇక శంకర్ సినిమాలు అనగానే అందరికి టక్కున గుర్తుకు వచ్చే సినిమా భారతీయుడు. కమల్ హాసన్ డ్యూయల్ రోల్లో వచ్చిన భారతీయుడు సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ మాత్రమే కాక సినీ ప్రియులంతా ఇండియన్ 2పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇండియన్ 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. శంకర్ కెరీర్లోనే ఈ చిత్రం భారీ ప్లాప్ గా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ 2 రివ్యూలు, ఇండియన్ 3పై దర్శకుడు శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ఇండియన్ 2 మీద వచ్చిన నెగిటివ్ రివ్యూలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ 2 మీద ఈ స్థాయిలో నెగిటివ్ రివ్యూలను నేను ఊహించలేదు. కాకపోతే త్వరగానే మూవ్ ఆన్ అయ్యాను. ఇక త్వరలో రిలీజ్ కాబోయే గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 ఫలితాలే మాట్లాడతాయి. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచవు. థియేటర్స్ లో ఈ సినిమాలు చూసి గొప్ప అనుభూతి పొందుతారు అని చెప్పుకొచ్చారు. అంతేకాక ఇండియన్ 3 థియేటర్స్ లోనే విడుదల అవుతుందని తెలిపి.. కమల్ అభిమానులకు శుభవార్త చెప్పుకొచ్చారు. తన కామెంట్స్ తో మరోసారి ఇండియన్ సినిమాపై భారీ అంచనాలు పెంచారు శంకర్.
ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి బరిలో నిలవనుంది. పొంగల్ సందర్భంగా 2025, జనవరి 10న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో గేమ్ ఛేంజర్ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు పెంచేసింది. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా వస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. త్వరలోనే ట్రైలర్ ను లాంఛ్ చేసి మరింత హీట్ పెంచనున్నారు మేకర్స్.