Published on Dec 19, 2024 4:01 PM IST
టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ 2025’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ సినిమాను ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి.
అయితే, తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాను పూర్తి అడ్వెంచర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందించనుంది. ఇందులో ఓ చక్కటి ప్రేమ కథ కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మోగ్లీ వైల్డ్ అడ్వెంచర్ మొదలైంది.. అంటూ వారు ఈ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు.
ఇక ఈ సినిమాలో సాక్షి మదోల్కర్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.