Published on Dec 19, 2024 5:05 PM IST
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా కమర్షియల్‌గా కూడా అదిరిపోయే వసూళ్ల రాబట్టడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలోని కథ, స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేశాయి.
తాజాగా ఈ సినిమా 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ ఫీట్ సాధించిన చిత్రాలు చాలా అరుదు కావడంతో, ‘లక్కీ భాస్కర్’ మూవీ నిజంగానే లక్కీ అంటున్నారు మూవీ లవర్స్. ఇక ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు ఓటీటీలోనూ సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చిన దగ్గర్నుండి నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్‌గా టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది.
గత వీకెండ్ వరకు ఈ సినిమాకు నెట్‌ఫ్లక్స్‌లో ఏకంగా 15 మిలియన్ వ్యూస్ దక్కినట్టుగా తెలుస్తోంది. ఇలా గ్లోబల్‌గా కూడా ‘లక్కీ భాస్కర్’ చిత్రం ట్రెండ్ అవుతోండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.