యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. రీసెంట్గా ‘క’ చిత్రంతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు విశ్వ కరుణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా టైటిల్ను రివీల్ చేశారు మేకర్స్.
కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఈ సినిమాకు ‘దిల్రుబా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం లుక్ కూడా అదిరిపోయే విధంగా ఉంది. ఇక ఈ సినిమాలో హీరో ప్రేమతో పాటు క్రోధాన్ని కూడా చూడబోతున్నారంటూ మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో రుక్సర్ ఢిల్లోన్ హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. శివమ్ సెల్యులాయిడ్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది.
The post కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీకి ‘దిల్ రుబా’ టైటిల్ ఫిక్స్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.