కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అంటే విభిన్న సినిమాలకు పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన రా, ఉపేంద్ర, ఏ వంటి సినిమాలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. కానీ గత పదేళ్లుగా ఉపేంద్ర దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్వీయ దరర్శకత్వంలో ‘యుఐ’ అనే సినిమాను తానే స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. ;లహరీ ఫిల్మ్స్ బ్యానర్ పై జీ మనోహరన్, శ్రీకాంత్ కేపీ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఓవర్సీస్ నుండి అందుతున్న టాక్ ఎలా ఉందంటే
ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక డిస్క్లైమర్ చూస్తే తెలుస్తుంది దటీజ్ ఉపేంద్ర అని. ఈ సినిమాను 2040లో ప్రపంచం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ లో సెటైరికల్ విదానంలో తెరకెక్కించాడట. ప్రధమార్ధంలో వచ్చే హీరోయిన్ తో వచ్చే సైకో లవ్ ట్రాక్ వింటేజ్ ఉపేంద్ర సినిమాలను గుర్తుకుతెచ్చిందట. అలాగే ఉపేంద్ర మార్క్ మాటలతో సాగే నీది చాలా పెద్దది.. వాడితో కాస్త చిన్నది అనే ఈ సాంగ్ ను అద్భుతంగా మలిచాడని టాక్. ముఖ్యంగా ఇంట్వర్వెల్ బ్లాక్ తో తన ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ ఇచ్చేసాడు రియల్ స్టార్ ఉపేంద్ర. అలాగే ఈ సినిమాలో టెంపుల్ ఫైట్ తో పాటు రాజకీయ నాయకులతో జరిగే ఫైట్ డిజైన్ చేసిన విధానం ఆడియెన్స్ మతిపోగొట్టాడట ఉపేంద్ర. దాంతో పాటు ఈ సినిమాలోని ఓ ఎపిసోడ్ ప్రపంచంలో ఇంతవరకు ఏ దర్శకుడు కూడా ఇలా తీయాలని ఆలోచనే రాని విధంగా తెరకెక్కించాడట ఉప్పి. ఇక ఓవరాల్ గా ‘యుఐ’ తో వింటేజ్ ఉపేంద్రని మరోసారి చూస్తారని టాక్ అయితే ఓవర్సీస్ నుండి అందుతుంది.