టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి బాగుంది అనే టాక్ కూడా తెచ్చుకుంది. విడుదలైన తోలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిందని అధికారకంగా ప్రకటన కూడా చేసారు మేకర్స్.
కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను మంచి ధరకే కొనుగులు చేసింది. ఈ రోజు నుండి ఆహా లో జీబ్రా స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసారు. ఇటీవల ఈ సినిమాకు స్పెషల్ కాంటెస్ట్ కూడా నిర్వహించారు జీబ్రా యూనిట్. ఈ చిత్రంలో హీరో సత్యదేవ్ ఆహా OTT ద్వారా నిర్వహించబడుతున్న ప్రత్యేక Zebra పోటీలో భాగంగా తనకు ఇష్టమైన వాచ్ మరియు గ్లాసెస్‌ని ప్రేక్షకులకు అందజేసే అవకాశాన్ని కల్పించాడు. ఆహా గోల్డ్‌కి సబ్‌స్క్రైబ్ చేసి, సినిమా చూసే అభిమానులు సత్యదేవ్ మరియు నటుడు సునీల్‌తో పాటు లీడ్ రోల్ లో నటించిన యాక్టర్స్ ధరించే ఈ ప్రత్యేకమైన గెలుచుకునే ప్రత్యేక అవకాశం ఉంటుంది. మరి నేటి నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న జీబ్రా ను ఈ వీకెండ్ లో చూసి గిఫ్ట్ లు గెలిచుకోండి