- కలెక్షన్లను కుమ్మేస్తోన్న పుష్ప రాజ్
- హిందీలో రికార్డ్ కలెక్షన్లు
- ఓటీటీకి వచ్చే ఛాన్స్ లేదంటున్న మేకర్స్
Pushpa 2 : దాదాపు రెండు వారాలుగా పుష్ప రాజ్ థియేటర్లను రూల్ చేస్తున్నాడు. తను ఇప్పట్లో స్లో అయ్యే మూడ్‌లో లేనట్లే అనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కుమ్మేస్తోంది. తెలుగుతో పోలిస్తే ఈ సినిమా హిందీలో ఒక రేంజ్ లో వసూల్ చేస్తుంది. సెకండ్ వీకెండ్ లోనూ థియేటర్లలో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ‘పుష్ప 2’ (హిందీ).
Read Also:Off The Record: ఆర్జీవీకి కూటమి సర్కార్ సినిమా చూపిస్తుందా..? వర్మపై కొత్త ఫైల్ సిద్ధం చేసిందా..?
‘పుష్ప 2’ హిందీ వెర్షన్ దాదాపు రూ.600కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. దీంతో అల్లు అర్జున్ సినిమా హిందీలో రెండో అతి పెద్ద సినిమాగా ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు షారుక్ ఖాన్ ‘జవాన్’ పేరిట ఉంది, దీని మొత్తం జీవితకాల కలెక్షన్స్ 584 కోట్లు. ‘పుష్ప 2’ వరుసగా రికార్డుల వేట కొనసాగిస్తోంది. కలెక్షన్లలో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా కూడా కళ్లు చెదిరే నంబర్లతో దూసుకుపోతుంది. అయితే, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కి సంబంధించి పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు చెక్ పెట్టారు మేకర్స్.
Read Also:Sritej: శ్రీ తేజ హెల్త్ బులిటెన్ విడుదల.. పరిస్థితి ఎలా ఉందంటే..?
‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే అవకాశమే లేదు. 56 రోజుల తరువాతే ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది.. అప్పటివరకు పుష్ప 2 వైల్డ్‌ఫైర్‌ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండని మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
Screenshot is ready!
Find your watermark version here: https://t.co/NAxzRPxyMJ
Your ticket to premium rewards, luxury perks, and nonstop giveaways – https://t.co/u2wsaK1307 pic.twitter.com/UjjIiNEQpI
— Tweet Shot (@_screenshoter) December 20, 2024