Ghaati : డ్రగ్ మాఫియా సామ్రాజ్యానికి లేడీ బాస్‌గా అనుష్క.. వయలెన్స్ వేరే లెవల్

  • ఘాటితో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వనున్న అనుష్క
  • తన పంథాను పక్కన పెట్టిన డైరెక్టర్ క్రిష్
  • ఏప్రిల్ 10న 5భాషల్లో గ్రాండ్ రిలీజ్

Ghaati : చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి మళ్ళీ ఒక పవర్ ఫుల్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఘాటి అనే పాన్-ఇండియన్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విడుదలవుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అనుష్క సీరియస్ గా భాంగ్ స్మోకింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. పోస్టర్‌లోని విక్టిమ్…క్రిమినల్…లెజెండ్ అనే పదాలు ఉత్సుకతను పెంచుతున్నాయి. ఈ సినిమా సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో విడుదలవుతున్నట్లు సమాచారం. స్క్రీన్‌ప్లే చాలా ఆకర్షణీయంగా ఉంటుందని చెబుతున్నారు. ఒక సాధారణ అమ్మాయి తన ప్రాణాలను కాపాడుకోవడానికి అడవి జంతువుల వంటి కొంతమంది క్రూరమైన వ్యక్తులతో ఎలా పోరాడుతుందనే ఇతివృత్తంతో ఈ సినిమా విడుదలవుతున్నట్లు సమాచారం.

Read Also:Samsung Galaxy S25: గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం అదిరిపోయే మొబైల్స్‌ను విడుదల చేయనున్న సామ్‌సంగ్

ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో అనుష్క స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈసారి తన పంథాకు భిన్నంగా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఘాటి సినిమాలో అనుష్కతో మునుపెన్నడూ చూడని విధంగా వయెలెన్స్ చేయించనున్నాడు. ఈ సినిమాలో అనుష్క డ్రగ్ మాఫియా సామ్రాజ్యానికి లేడీ బాస్‌గా ఎలా ఎదుగుతుంది. ఆమెకు ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది మనకు సినిమాలో చూపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసాన్ని ఘాటి చిత్రంతో అనుష్క కొనసాగిస్తుందా.. అనేది చూడాలి. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Read Also:Pushpa 2 : ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

ఈ చిత్రానికి నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు సమకూరుస్తున్నారు. చింతకింది శ్రీనివాసరావు ఘాటి చిత్రానికి కథ అందించారు. ఘాటి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *