Odela 2 : ‘ఓదెల 2’ నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

  • ఓదెల 2నుంచి మరో కొత్త పోస్టర్
  • తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్
  • పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానున్న మూవీ

Odela 2 : రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అశోక్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, పూజిత పొన్నాడలు తమ నటనతో ఆకట్టుకున్నారు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ‘ఓదెల 2’గా సీక్వెల్ రాబోతుంది.

Read Also:Telangana Assembly 2024 LIVE: నేడు 7వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

ఓదెల 2గా వస్తున్న సీక్వెల్‌కు కథ, కథనంతో పాటు నిర్మాతగా కూడా డైరెక్టర్ సంపత్ నంది వ్యవహరిస్తున్నారు. ఈ సీక్వెల్‌ని కూడా అశోక్ తేజనే తెరకెక్కిస్తున్నారు. ఓదెల రైల్వే స్టేషన్‌లో హెబ్బా పటేల్ నటించగా.. ఓదెల 2లో మాత్రం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్నారు. మహాశివరాత్రి నాడు తమన్నా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. కాశీ గంగా నది తీరాన తమన్నా నడుస్తున్న ఫొటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ చేతిలో ఢమరుకం, మరో చేతిలో దండం పట్టుకుని తమన్నా ఉన్నారు. శివ శక్తిగా ఆమె నటిస్తున్నారు. తమన్నా భాటియా బర్త్ డే సందర్భంగా తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఓదెల2 నిర్మాతలు తమన్నాను తన పెరోషియస్ నాగ సాధు అవతార్‌లో ప్రజెంట్ చేస్తూ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో ఆమె పుర్రెలపై ధైర్యంగా నడుస్తున్నట్లు కనిపించారు, రాబందులు పైన ఎగురడం టెర్రిఫిక్ గా వుంది. ఈ అద్భుతమైన పోస్టర్ చిత్రంలో ఆమె పాత్ర ఇంటెన్స్ అండ్ పవర్ ఫుల్ నేచర్ ని సూచిస్తున్నాయి.

Read Also:Biggboss Sonia : బిగ్ బాస్ సోనియా పెళ్లి.. కనిపించని పెద్దోడు.. చిన్నోడు

మొదటి పార్ట్ ఓటీటీలో రిలీజ్ కాగా.. ఈసారి థియేటర్లలో పలు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌ వర్క్స్ సంస్థలపై డి మధు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాంతారా, విరూపాక్ష, మంగళవారం వంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించిన అంజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *