మొల్లేటి ‘పుష్ప’రాజు విధ్వంసం..1000 కోట్లతో చరిత్ర తిరగరాసిన అల్లు అర్జున్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 21, 2024 3:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తో చేసిన సెన్సేషనల్ హిట్ చిత్రం పుష్ప 2 ది రూల్ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో తెలిసిందే. మరి ఇండియన్ సినిమా దగ్గర ఊహించని ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు సాధించి అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం టాప్ 2 గ్రాసర్ గా దూసుకెళ్తుంది. మరి హిందీలో ఈ చిత్రం ఆల్ టైం రికార్డు వసూళ్లు క్రాస్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు వరకు హిందీ సినిమా హిస్టరీ లోనే ఏ సినిమా అందుకోని వసూళ్లు పుష్ప 2 ఒక డబ్బింగ్ సినిమాగా వచ్చి చరిత్ర సృష్టించింది. ఇక లేటెస్ట్ వసూళ్లు డీటెయిల్స్ బయటకి వచ్చాయి. నిన్న శుక్రవారం హిందీలో పుష్ప 2 కి 12.5 కోట్ల నెట్ వసూళ్లు అందుకోగా పి ఆర్ లెక్కల ప్రకారం ఈ చిత్రం 645 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో హిందీలో ఈ వారాంతానికి 700 కోట్ల వసూళ్ల టార్గెట్ గా వెళుతుంది అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా లాంగ్ రన్ లెక్కలు ఎక్కడ ఆగుతాయో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *