Sandhya Theatre stampede:సంధ్య థియేటర్‌ కి మరో షాక్?

  • హైదరాబాద్‌: రాత్రి 7 గంటలకు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్
  • తన నివాసం నుంచి అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్
  • సీఎం రేవంత్ ప్రకటన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ తో నెలకొన్న ఆసక్తి.

ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద సంధ్య థియేటర్ అంశం మీద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ థియేటర్కి రాకూడదని సంధ్య థియేటర్ కి లిఖితపూర్వకంగా పోలీసులు సమాచారం ఇచ్చినా హీరో వచ్చాడని రావడమే కాదు రోడ్ షో చేస్తూ ఎక్కువ మంది జనాన్ని ఆకర్షించాడని ఆయన ఆరోపించారు. అంతేకాదు తొక్కిసలాట జరిగినా, తర్వాత సినిమా చూస్తున్న సమయంలో పోలీసులు వెళ్లిపోవాలని కోరినా సరే వెళ్లకున్న అక్కడే ఉన్నాడని అరెస్ట్ చేస్తానంటే అప్పుడు మాత్రమే బయటకు వెళ్లారని ఆయన పేర్కొన్నారు.

Sritej Health Bulletin: శ్రీతేజ్ హెల్త్ అప్డేట్.. ఇప్పుడు ఎలా ఉందంటే?

అంతే కాదు వెళ్లే సమయంలో కూడా రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్లీ రోడ్ షో చేస్తూ వెళ్ళాడని, ఇలాంటి ఘటనల నేపథ్యంలో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళిన పోలీసులతో కూడా అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించినట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక తాజాగా ఈ అంశం మీద స్పందించేందుకు అల్లు అర్జున్ తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు ఏడు తర్వాత మీడియాతో మాట్లాడబోతున్నట్లుగా అల్లు అర్జున్ టీం నుంచి మీడియాకు సమాచారం అందింది. అయితే రేవంత్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారా? లేక అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వాస్తవానికి ఈ ఘటన మీద ప్రస్తుతానికి కోర్టు కేసు నడుస్తోంది. కేసు నడుస్తున్న సమయంలో అల్లు అర్జున్ దాని గురించి ప్రస్తావించవచ్చా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *