గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికాలోని డల్లాస్ చేరుకుంది సినిమా టీం. ఈ క్రమంలో డల్లాస్ లో అభిమానులతో ఫ్యాన్స్ మీట్లో రామ్చరణ్ తో పాటు దిల్ రాజు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ టైటిల్ పెట్టినప్పుడే ఇన్నోవేటివ్ గా ప్రోగ్రామ్స్ చేయాలని అనుకున్నాం. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికాలోని డల్లాస్ ను సెలెక్ట్ చేసుకున్నాం.
ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా విదేశాల్లో చేయడం. గేమ్ ఛేంజర్ టైటిల్ లానే ఈ ఈవెంట్ కూడా ఇలా గేమ్ ఛేంజింగ్ గా చేశాం. దానికి రాజేష్ ముందుకు వచ్చి సపోర్ట్ చేశాడు. అలాగే గ్లోబల్ స్టార్ మనతో ఇక్కడికి వచ్చారు. అలాగే మేం చెప్పేది ఒకటే డైలాగ్, అన్ ప్రిడిక్టబుల్ అంటూ చెప్పుకొచ్చారు.