Allu Arjun: పోలీసులు నాకు ఏం చెప్పలేదు.. అసలు విషయం బయట పెట్టిన అల్లు అర్జున్ !

అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్చ్ చేశారు. మీరు తప్పుడు సమాచారం అనుకోండి, తప్పుడు ప్రచారం అనుకోండి, తప్పుడు ఆరోపణలు అనుకోండి అయినా సరే ఆరోజు నేను ఎలాంటి రోడ్ షో చేయలేదు ఊరేగింపు చేయలేదు.. థియేటర్ లోపలికి వెళుతున్నప్పుడు జనాలు ఎక్కువగా ఉంటే చేయి ఊపి లోపలికి వెళ్ళిపోయాను. థియేటర్ లోపల నేను సినిమా చూస్తున్న కొద్దిసేపటికి నా వరకు ఏ పోలీస్ కాని ఎవరూ రాలేదు. నా వరకు ఎవరూ కలవలేదు నాకేమీ చెప్పలేదు. మేనేజ్మెంట్ తరఫున మా వాళ్ళకి వచ్చి చెప్పిన విషయం ఏమిటంటే బయట జనాలు ఎక్కువ అవుతున్నారు. దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. బయట పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువమంది వచ్చేస్తున్నారు మీరు వెళ్లిపోండి అంటే నేను వెళ్ళిపోయాను.

Allu Arjun: నాకు థియేటర్లోకి పోలీసులే దారి క్లియర్ చేశారు…అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు

సినిమా మొదలైన కొద్దిసేపటికి నేను వెళ్ళిపోయాను.. నేను నా భార్య సహా మేమందరం బయటికి వచ్చేసాం. ఆ తర్వాత రోజు నాకు తెలిసింది.. ఒక మహిళ కళ్ళు తిరిగి పడిపోయింది ఆ తర్వాత ఆమె చనిపోయిందని ఆమె కుమారుడు ఉన్నాడు అని తెలిసిన తర్వాత నేను షాక్ కి గురయ్యాను. తర్వాత రోజు వరకు నాకు ఆ విషయమే తెలియదు. ఎందుకంటే నేను నా పిల్లోడినే పక్కన పెట్టుకున్నాను, నా కుమార్తె నా పక్కనే ఉంది. నాకు తెలియదు.. ఒకవేళ అది నిజంగా తెలిసి ఉంటే నేను వెంటనే వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. నేను ఈ విషయం తెలియక నా పిల్లల్ని అక్కడే సినిమా చూస్తూ ఉండమని వెళ్లిపోయాను. ఇలాంటి పరిస్థితులలో ఎవరైనా పిల్లల్ని వదిలేసి వెళతారా నాకు తెలియకే కదా నా పిల్లల్ని సినిమా చూడమని చెప్పి నేను వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రోజు తెలిసింది. వెంటనే షాక్ అయ్యాను. వెంటనే బన్నీ వాసుకి ఫోన్ చేసి హాస్పిటల్ కి వెళ్ళమన్నాను.

వెంటనే హాస్పిటల్ కి వెళ్లి కలువు నేను వస్తాను అంటే నేను మొత్తం సెట్ చేసి వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్ గా ఎలా ఉన్నారో ఏంటో చెక్ చేసుకుని తర్వాత మనం వెళ్ళాలి మీరు ఆవేశపడి రావద్దు అని చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు దయచేసి మీరు హాస్పిటల్ కి రావద్దు ఇక్కడ గందరగోళం అయిపోతుంది. నిన్న నైట్ మీరు థియేటర్ కి వెళ్లారు.. అక్కడ ఇష్యూ అయింది, మీరు హాస్పిటల్ కి వస్తే మళ్లీ ఇష్యూ అవుతుంది నేనే వాళ్లతో మాట్లాడతాను. దహన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నేనే వారిని మీ దగ్గరికి తీసుకు వస్తానని చెప్పాడు. నేను సరేనని వెయిట్ చేస్తున్నాను, సార్ మీరు ఏమీ అనుకోవద్దు వాళ్లు మీ మీద కేసు ఫైల్ చేశారు. మీరు ఇప్పుడు వారిని కలవడానికి లేదంటే అయినా పర్లేదు కలిసే ప్రయత్నం చేద్దామని అనుకున్నాను కానీ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది. వాళ్ళు మీ మీద కేసు పెట్టారు మీరు ఇప్పుడు వెళితే లీగల్ గా అది కరెక్ట్ కాదు.. వెళ్లవద్దు అని గట్టిగా చెబితే ఆగాల్సి వచ్చింది అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *