‘ఎన్టీఆర్ – హృతిక్’ పై ఛేజింగ్ సీక్వెన్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ తర్వాత తన నెక్స్ట్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే ఆయన నటిస్తున్న బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘వార్-2’ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇటీవల ఓ భారీ షెడ్యూల్ కోసం తారక్ ముంబై వెళ్లాడు.

అయితే, ఇప్పుడు ఈ లెంగ్తీ యాక్షన్ సీక్వెన్స్‌ను తారక్ పూర్తి చేసినట్లు బిటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో మరో హీరో హృతిక్ రోషన్ కూడా పాల్గొన్నాడని తెలుస్తోంది. వాస్తవానికి ఈ షెడ్యూల్ జనవరిలో జరగాల్సి ఉందట. కానీ, తారక్ ఈ షూటింగ్‌ను 2025 జనవరి చివరినాటికి ముగించాలని చూస్తున్నాడట. దీంతో దర్శకుడు అయాన్ ముఖర్జీ అండ్ టీమ్ వార్-2 షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తు్న్నారు.

సాంగ్స్ మినహా పూర్తి షూటింగ్‌ను జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ తరువాత ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమాలో జాయిన్ కానున్నాడు. ‘వార్-2’ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుంది.

The post ‘వార్-2’ లెంగ్తీ షెడ్యూల్ ముగించుకున్న ఎన్టీఆర్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *