Published on Dec 22, 2024 2:57 AM IST
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా పూర్తి సోషియో ఫాంటెసీ మూవీగా ఇది రానుంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాను వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ తన నెక్స్ట్ చిత్రాలను యంగ్ డైరెక్టర్స్‌తో చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ జాబితాలో శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి ఉన్నారు. వారితో పాటు మరో తమిళ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నాడట. తమిళ హీరో కార్తితో ‘సర్దార్’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మిత్రన్, మెగాస్టార్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ కథను రెడీ చేశాడట.
ఇప్పుడు ఈ కథను చిరంజీవికి వినిపించి ఓకే చేయించుకునే పనిలో మిత్రన్ బిజీగా ఉన్నట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ చిరంజీవి నిజంగానే మిత్రన్‌కు ఈ అవకాశం ఇస్తే, త్వరలోనే మరో సినిమాతో ఆయన మన ముందుకు రావడం ఖాయమని చెప్పాలి. మరి మిత్రన్‌కు మెగా ఛాన్స్ దొరికేనా లేదా అనేది చూడాలి.