- గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- భారీగా తరలి వచ్చిన జనసందోహం
- అభిమానులకు కిక్ ఇచ్చే సినిమా గేమ్ ఛేంజర్
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిన తర్వాత నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను బాగా పెంచాయి. సాధారణంగా తెలుగు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతాయి.
Read Also: Pushpa -2 : బుక్ మై షో ‘కింగ్’ గా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్
కానీ గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరిగింది. అమెరికాలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన తొలి భారతీయ సినిమాగా గేమ్ ఛేంజర్ కొత్త రికార్డు సృష్టించింది. ఈ ఈవెంట్‌ను అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు, అతిథి నటుడు సుకుమార్, బుచ్చిబాబు, యాంకర్ సుమ వీరితో పాటు అనేక మంది గేమ్ ఛేంజర్ నటులు ఇప్పటికే అమెరికా చేరుకున్న విషయం తెలిసిందే. వారితో పాటు ఈవెంటు భారీగా జనసందోహం హాజరైంది.
#Gamechanger 🔥🔥🔥🔥🔥🔥🔥
Cinema chuseytappudu Andhra Lo ippudu jaruguthunna situations chala kanipisthai ,Sync authai 💥💥💥💥💥
Babai- Abbai 💥💥💥💥💥💥💥💥💥 #GlobalStarRamCharan #RamCharan pic.twitter.com/BcBqlWdSpP
— SivaCherry (@sivacherry9) December 22, 2024
Read Also: Game Changer : నా ఫోన్లో రామ్ చరణ్ పేరును ‘ఆర్సీ ద కింగ్’ అని సేవ్ చేసుకున్న : ఎస్ జే సూర్య
ఈ ఈవెంట్ ను ఉద్దేశించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. మీకు కచ్చితంగా నచ్చి తీరుతుందన్నారు. మీకు తెలుగు రాష్ట్రాలో కనిపించే ఇన్సిడెంట్స్ చాలా సినిమాలో కనిపిస్తాయని తెలిపారు. కానీ డైరెక్టర్ శంకర్ నాలుగేళ్ల క్రితం రాసుకున్న సీన్లు అన్నారు. అవి ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. అవి ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తాయన్నారు. తెలుగు ప్రేక్షకులకు, యావత్ భారత దేశ ప్రేక్షకులకు ఓ హై ఓల్టేజ్ సినిమా ఇస్తున్నామన్నారు. దేశంలోని అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందన్నారు. మెగా అభిమానులకు తప్పకుండా ఓ కిక్ ఇస్తుందని దిల్ రాజు తెలిపారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. తమన్ మ్యూజిక్ అందించారు.