GameChanger : ‘దోప్’ లిరికల్ సాంగ్ రిలీజ్.. చరణ్ డాన్స్ వేరే లేవల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్యాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో  బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్యాన్ ఇండియా బాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ గా ఉంది గేమ్ ఛేంజర్.

నిర్మాత దిల్ రాజు పుట్టినరోజున కానుకగా ఈ సినిమాలోని ‘దోప్‌’ సాంగ్  టీజర్ ను రిలీజ్ చేయగా అద్భుత స్పందన తెచ్చకోగా నేడు USA లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. సరస్వతి పుత్ర రామ జోగయ్య శాస్త్రి సాహిత్యంతో థమన్ సంగీతం అందించగా రోషిణి JKV మరియు పృధ్వీ శృతి రంజని పాడిన ఈ పాట సిన్మాకే హైలెట్ గా నిలుస్తుందని యూనిట్ భావిస్తోంది. తాజాగా విడుదలైన లిరికల్ సాంగ్ లో రామ్ చరణ్ డాన్స్ బీట్స్ ఫాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక తమిళ్ లో ఈ సాంగ్ ను శంకర్ కుమార్తె అతిధి శంకర్ ఆలపించడం విశేషం. డల్లాస్ లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా తరలి వచ్చారు మెగా ఫ్యాన్స్. అభిమానులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *