- సూపర్ హిట్ గా నిలిచిన ఉపేంద్ర లేటెస్ట్ మూవీ
- రెండో రోజును మించి మూడో రోజు బుకింగ్స్
- డైరెక్టర్ గా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఉప్పి
UI Movie : కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి తెలియని వారుండరు. ఆయన ఒక్క కన్నడలోనే కాకుండా సౌత్ ఇండియా అంతటా మంచి క్రేజ్ ఉన్న హీరో. ఉపేంద్ర ఒకప్పుడు దర్శకుడిగా శంకర్ ని మించిన సినిమాలు తీశారు. అప్పట్లోనే చాలా అడ్వాన్స్డ్ గా ఆయన సినిమాలు ఉండేవి. అయితే ఉపేంద్ర డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టి కొన్నేళ్లు అయింది. దర్శకుడిగా చివరిగా తొమ్మిదేళ్ల కింద ఉప్పి2 సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మళ్లీ ఇప్పుడు ‘UI’ అనే సినిమాతో దర్శకుడిగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా చేస్తున్న ‘UI’ నుండి ఇంతకు ముందు వచ్చిన పోస్టర్ టీజర్ తోనే తన మార్క్ చూపిస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ లో సినిమాని ప్రజెంట్ చేశారు.
Read Also:Astrology: డిసెంబర్ 23, సోమవారం దినఫలాలు
తన మార్క్ వైవిధ్య కాన్సెప్ట్ లతో అలరించే నటుడు దర్శకుడు ఉపేంద్ర నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా కావడంతో అభిమానులు చూసేందుకు ఆసక్తిని కనబరిచారు. ఓ క్రేజీ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడ సహా తెలుగులో అదరగొడుతుందనే చెప్పాలి. మొదటి రోజు నుంచే సాలీడ్ బుకింగ్స్ తో స్టార్ట్ అయిన ఈ మూవీ ఇపుడు మూడో రోజుకి వచ్చేసరికి మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది అని చెప్పాలి. డే 1 కంటే డే 2 బుకింగ్స్ ఎక్కువగా నమోదు కాగా ఇపుడు రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ బుకింగ్స్ ని నమోదు చేసి ఈ సినిమా అదరగొడుతుంది. దీంతో మూడు రోజుల్లో యూఐ సినిమా సాలిడ్ పెర్ఫామెన్స్ ని చూపించిందనే చెప్పాలి. ఇలా మొత్తానికి అయితే మళ్ళీ ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారనే చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా లహరి ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు.
Read Also:Salaar 2 : “సలార్ పార్ట్ 2” రిలీజ్ పై సాలిడ్ అప్డేట్.. వచ్చేది ఎప్పుడంటే ?