Kareena Kapoor : నేనేం కొంపలు కూల్చనంటున్న స్టార్ హీరోయిన్

  • హృతిక్ తో డేటింగ్ ప్రచారంపై స్పందించిన కరీనా కపూర్
  • భార్యతో విడాకులు తీసుకున్న హృతిక్ రోషన్
  • నేనేం కొంపలు కూల్చనంటున్న బెబో

Kareena Kapoor : బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోష‌న్ రిలేష‌న్‌షిప్స్ అన్నివేళ‌లా చర్చనీయాంశంగానే ఉంటాయి. అత‌డు త‌న చిన్ననాటి స్నేహితురాలు సుస్సానే ఖాన్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. కానీ హృతిక్- సుస్సానే జంట విడిపోయి అభిమానుల‌కు భారీ షాక్ ఇచ్చారు. టీనేజీ వ‌య‌సు నుంచే ఈ జంట గొప్ప ప్రేమికులుగా నిలిచారు. ఆ త‌ర్వాత ఇంట్లోవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు వారసులు కలిగారు. వారు పెద్దవాళ్లవుతున్నారు. కానీ హృతిక్ సుస్సానే ఖాన్ విడాకులు తీసుకున్నారు. అయితే `క‌హోనా ప్యార్ హై` చిత్రంతో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన హృతిక్ రోష‌న్ స‌ర‌స‌న క‌రీనా క‌పూర్ జంటగా నటించాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ ఛాన్స్ మిస్స‌యింది. అత‌డి డెబ్యూ చిత్రంలో అమీషా ప‌టేల్ క‌థానాయిక‌గా న‌టించే ఛాన్స్ దక్కించుకుంది. ఆ త‌ర్వాత హృతిక్- క‌రీనా క‌పూర్ జంట‌గా ప‌లు చిత్రాల్లో యాక్ట్ చేశారు. ఆ స‌మ‌యంలో హృతిక్ తో క‌రీనా స‌న్నిహితంగా ఉంటోంద‌ని ప్రచారం కూడా జరిగింది. సుస్సానేతో హృతిక్ పెళ్లికి ముందు అత‌డితో క‌రీనా డేటింగ్ చేస్తోంద‌ని ప్రచారం జరిగింది. ఇదే విష‌యాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా క‌రీనా క‌పూర్ ఖాన్ అవ‌న్నీ పుకార్లేనని కొట్టి పారేసింది.

Read Also:Daaku Maharaj : ‘డాకు మహారాజ్’లో హైలైట్ ఎపిసోడ్ అదేనట

హృతిక్ మంచి పిల్లాడు… అలా చేయ‌డు! అంటూ కితాబిచ్చిన క‌రీనా క‌పూర్ త‌న‌కు సుస్సానే బెస్ట్ ఫ్రెండ్ అని.. త‌న విష‌యంలో అలా చేయ‌న‌ని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. నేను వేరొక స్త్రీ ఉసురు పోసుకోలేనని తెలిపింది. హృతిక్ అప్ప‌టికే క‌మిట‌య్యాడు.. సుస్సానేతో ప్రేమ‌లో ఉన్నాడు. అందువ‌ల్ల ఆ ప‌ని చేయ‌లేన‌ని కూడా క‌రీనా చెప్పింది. నాపై అప్ప‌ట్లో ప్ర‌చార‌మైన గాసిప్స్ కి చాలా షాక‌య్యాన‌ని కూడా క‌రీనా తెలిపింది. తాను విదేశాల‌కు వెళ్లి రాగానే, ఈ వార్త‌లు ప్ర‌చురిత‌మ‌య్యాయ‌ని, అది తెలిసి షాక్ లో ఉండిపోయాన‌ని వెల్ల‌డించింది. “హృతిక్ చాలా సెన్సిబుల్. అత‌డు ఎవ‌రికీ అంత తేలికగా పడిపోడు సుస్సానేకి నాకు ఈ విష‌యం బాగా తెలుసు. నేను ఎలాంటి వ్యక్తినో సుజాన్ కి క‌చ్చితంగా తెలుసు“న‌ని క‌రీనా అన్నారు. నేను మరొక స్త్రీ ప్రేమించే పురుషుడిని ఎందుకు కోరుకుంటాను? నేను చాలా స్వార్థపరురాలిని. నా కోసం నాతో ఉండే మనిషి కావాలి. నేను నావాడిని ఎవరితోనూ షేర్ చేసుకోలేనంటూ చెప్పుకొచ్చింది. నేను ఒక‌రి ఇల్లు (కొంప‌) కూల్చే ఆడ‌దానిని కాదు.. నేను ఎప్పటికీ అలా ఉండలేను. ఇతరుల ఇళ్లలో విధ్వంసం సృష్టించేదుకు మమ్మల్ని పెంచ‌లేదు. అయినా నేను మరొక స్త్రీ శాపం కోరుకోనని వెల్ల‌డించింది కరీనా.

Read Also:Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేడు తులం బంగారం ధర ఎంతుందంటే?

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *