Shambala : సైకిలెక్కిన సైంటిస్ట్‌.. ఆసక్తికరంగా ‘శంబాల’ పోస్టర్!

  • మరో సినిమాతో రాబోతున్న ఆది సాయికుమార్
  • హిట్టుకోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆది
  • భారీ బడ్జెట్ లో వస్తున్న ‘శంబాల’

Shambala : వర్సటైల్ యాక్టర్ సాయికుమార్ కుమారుడు ఆది సాయికుమార్ చాలాకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కాస్త వెరైటీ సబ్జెక్టులను ఎంచుకుంటున్న యువ హీరో.. ప్రస్తుతం ”శంబాల” అనే సినిమాతో రాబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. నేడు ఆది సాయి కుమార్ బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా, మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘శంబాల’ పోస్టర్ లో మండుతున్న పొలాల మధ్యలో ఆది సాయికుమార్ సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. అతను టక్ చేసుకుని, ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? మూవీ కాన్సెప్ట్ ఏంటి? అనేది తెలుసుకోవాలనే ఉత్సుకతను అభిమానుల్లో రేకెత్తిస్తోంది.

Read Also:PDS Ration Scam: డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా?.. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు!

ప్రస్తుతం వాస్తవానికి దూరంగా మరో ప్రపంచంలో జరిగే కథలకు ఆడియన్స్‌ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఓ మిస్టిక్ వరల్డ్‌లో రూపొందుతున్న సినిమా ‘శంబాల’. పోస్టర్‌తోనే గతంలో ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయని ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లబోతున్నామన్న హింట్ ఇచ్చారు. ‘శంబాల’ కథ లో వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్స్‌ చాలానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. డిసిప్లిన్, డెడికేషన్ కు కేరాఫ్ గా నిలిచిన ఆది సాయికుమార్ ఈసారి జియో సైంటిస్ట్ గా ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్న ఆనంది ఈ సినిమా లో ఆదికి జోడీగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా అతి త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది.

Read Also:Bashar al-Assad: రష్యాలోని సిరియా మాజీ అధ్యక్షుడికి షాక్.. విడాకులు కోరిన భార్య!

సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ స్క్రీన్ మీద ఇంత వరకు టచ్‌ చేయని డిఫరెంట్ స్టోరీ లైన్‌ను చూపించబోతున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌ ఫిలిం అకాడమీలో ఫిలిం మేకింగ్‌ ట్రైనింగ్‌ తీసుకున్న యుగంధర్‌, ‘శంబాల’ సినిమాను హాలీవుడ్ స్థాయిలో హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనుకాడకుండా విజువల్స్‌ పరంగా, టెక్నికల్‌ గా సినిమాను “టాప్‌ క్లాస్‌”అనే రేంజ్‌లో తెరకెక్కించేందుకు అన్ని రకాలుగా సహకరింస్తున్నారు నిర్మాతలు రాజశేఖర్‌ అన్నభీమోజు , మహిధర్ రెడ్డి. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో రాబోతున్న ‘శంబాల’ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *