Dulquer : పీరియాడిక్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంటోన్నస్టార్ హీరో

  • మహానటి నుండి లక్కీ భాస్కర్ వరకు ఇదే బ్యాక్ డ్రాప్
  • రాబోతున్న కాంత కూడా ఇదే జోనర్
  • తెలుగులో మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..!

లక్కీ భాస్కర్‌తో తెలుగులో హ్యాట్రిక్ సక్సెస్ చూసిన మాలీవుడ్ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్. పూర్తి స్థాయిలో ఇక్కడ హీరోగా ఛేంజ్ అయ్యాడు. ఈ హిట్స్ వెనుక ఓ విచిత్రమైన లింక్ ఉంది. దుల్కర్ హిట్ కొట్టిన సినిమాలు అన్ని పీరియాడిక్ చిత్రాలే కావడం విశేషం. 1950-80 స్టోరీతో తెరకెక్కిన మహానటి. ఈ జోనర్ మూవీనే. టైటిల్ క్రెడిట్ కీర్తి సురేష్ తన ఖాతాలోకి వెళ్లిపోయినా. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ బొమ్మను తన అకౌంట్‌లో వేసుకున్నాడు దుల్కర్.

మహానటి తర్వాత చేసిన సీతారామం కూడా పీరియాడిక్ మూవీనే. లెఫ్టినెంట్ కల్నల్‌ రామ్‌గా గుండెల్ని పిండేసే యాక్టింగ్‌తో మనసుల్ని దోచేసిన దుల్కర్ మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది కూడా 90స్ బ్యాక్ డ్రాప్ స్టోరీనే. ఈ రెండింటికీ మధ్యలో వచ్చిన మలయాళ మూవీ కురుప్ కూడా 70స్ స్టోరీ. ఇక రీసెంట్లీ వచ్చిన లక్కీ భాస్కర్ 80స్ డ్రామా. ఈ పీరియాడిక్ డ్రామాలు దుల్కర్‌కు లక్కీ ఫ్యాక్టర్లుగా ఛేంజ్ అయ్యాయి. ఇలా అచ్చిరావడంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా పీరియాడిక్ డ్రామానే ప్లాన్ చేస్తున్నాడు దుల్కర్. రీసెంట్లీ స్టార్టైన కాంత కూడా 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని టాక్ నడుస్తోంది. దీనితో పాటు తెలుగులో న్యూ డైరెక్టర్ రవితో ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా కన్ఫమ్ అయ్యిందని టాక్.  ఇవే కాకుండా మలయాళంలో ఆర్డీఎక్స్ ఫేం నహస్ హిదయాత్‌తో ప్రాజెక్టు కూడా పీరియాడిక్ బ్యాడ్రాప్ లో. ఇందులో ఫస్ట్ టైం ప్రియాంక మోహన్ జోడీ కట్టబోతుంది

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *