Mohan Babu: మోహన్‌ బాబుకు హైకోర్టు షాక్

  • తెలంగాణ హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు
  • మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు
  • రిపోర్టర్‌పై దాడి కేసులో మోహన్‌బాబుపై కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు

తెలంగాణ హైకోర్టులో మోహన్‌ బాబుకు మరోసారి చుక్కెదురు అయింది. మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.. రిపోర్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పహాడీ షరీఫ్‌ పోలీసులు.. ఇప్పుడు తాజాగా మోహన్‌బాబుపై కేసు రాచకొండ పోలీసులు నమోదు చేశారు. మోహన్‌బాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ముగియగా.. తీర్పును నేటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ క్రమంలోనే మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.

Allu Arjun : గాంధీ భవన్లో అల్లు అర్జున్‌ మామకు చేదు అనుభవం!

ఇక మరోవైపు.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని శ్రీవిద్యానికేతన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వద్ద కూడా మీడియాపై దాడి జరిగిన విషయం విదితమే.. అయితే, ఈ కేసులో మంచు మోహన్‌బాబు పీఆర్వో, బౌన్సర్లుకు ఊరట దక్కింది.. మోహన్ బాబు పీఆర్వో సతీష్‌తో పాటు ఏడుగురికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు పోలీసులు. ఈ నెల 9వ తేదీన మోహన్‌బాబు యూనివర్సిటీ ఎదుట న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టుల పై దాడి జరగగా.. జర్నలిస్టుల ఫిర్యాదుతో పీఆర్వో సతీష్ తో పాటు మరి కొందరి పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇప్పుడు వారికి ఊరట కలిగిస్తూ స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేశారు..

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *