Sunny Leone: సన్నీ లియోన్, వైఫ్ ఆఫ్ జానీ సిన్స్ కి నెల నెలా రూ.1000 ప్రభుత్వ సాయం

అదేంటి కోట్లు సంపాదించే సన్నీలియోన్ నెలకు వేయి వచ్చే సంక్షేమ పధకం అందుకోవడం ఏంటి అని షాక్ అవద్దు. మన భారత దేశంలో వ్యవస్థలు ఇంకా ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలిపే ఘటన ఇది. సన్నీలియోన్ పేరుపై ఛత్తీస్‌గఢ్‌లో దుమారం రేగుతోంది. అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ మహతారీ వందన యోజన పథకం. ఈ కింద ప్రతి నెలా మహిళల ఖాతాల్లో రూ.1000 జమ అవుతుంది. ఈ పథకం కింద బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతో క్రియేట్ అయిన ఖాతాకు ప్రతి నెలా వెయ్యి రూపాయలు జమ అవుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై రాజకీయాలు వేడెక్కాయి. ఈ పథకంలో భారీ అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సన్నీలియోన్ పేరుతో నిరంతరం డబ్బులు కాజేస్తున్న వ్యక్తి ఎవరో గుర్తించారు. ఆ వ్యక్తిని వీరేంద్ర జోషిగా గుర్తించారు.

Mohan Babu: మోహన్‌ బాబుకు హైకోర్టు షాక్

సన్నీ లియోన్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆపరేట్ చేసింది అతనే. అతనిపై కేసు నమోదు చేసి లబ్ధిదారుల వెరిఫికేషన్‌లో ఉన్న అధికారులపై కూడా విచారణ జరుపుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌లోని తాలూర్‌ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా, డబ్బు రికవరీ చేసేందుకు వీలుగా ఈ విషయమై విచారణ జరిపి బ్యాంకు ఖాతాను స్తంభింపజేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను జిల్లా కలెక్టర్ హారిస్ ఎస్ కోరారు. ఈ విషయమై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వరుసగా ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. మహతారీ వందన్ యోజన లబ్ధిదారుల్లో 50 శాతానికి పైగా నకిలీవేనని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్ పేర్కొన్నారు. కాగా, తమ హయాంలో చేయలేనిది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తోందని, మహిళలకు నెలనెలా సాయం అందుతుండడంతో కాంగ్రెస్‌ మనస్తాపానికి గురైందని బీజేపీ అంటోంది. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏమిటంటే సన్నీ లియోన్ భర్తగా ఇంటర్నేషనల్ మేల్ పార్న్ స్టార్ జానీ సిన్స్ పేరు ఉండడం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *