Sritej: శ్రీ తేజ హెల్త్ బులిటెన్ విడుదల.. మళ్ళీ పెరుగుతున్న ఫీవర్

సంధ్య థియేటర్ తొక్కిసలాట లో గాయపడిన శ్రీ తేజ్ హెల్త్ బులిటెన్ ను కిమ్స్ హాస్పిటల్ టీం విడుదల చేసింది. కిమ్స్ హాస్పిటల్ టీం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం శ్రీ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతానికి శ్రీ తేజ్ వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండానే ఊపిరి పీల్చుకో గలుగుతున్నాడని వైద్యులు వెల్లడించారు. అయితే శ్రీ తేజ్ కి ఫీవర్ మళ్లీ పెరుగుతోందని, వైట్ బ్లడ్ సెల్స్… మిగతా సెల్స్ అన్ని ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాయని పేర్కొన్నారు.

Air India: తొలి ఫ్లైట్ జర్నీలో మద్యం, ఫుడ్ ఖాళీ చేసేసిన సూరత్ ప్యాసింజర్స్!

అంతేకాక ఫుడ్ తీసుకోగాలుగుతున్నాడని వెల్లడించారు. అయితే నాడీ వ్యవస్థ పనితీరు ఇప్పటికీ అలాగే ఉందని పేర్కొన్నారు. ఇక తాజాగా శ్రీ తేజ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రి కొన్ని సూచనలు చేశారు. ఇక మంత్రి కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో పుష్ప 2 నిర్మాతలు యెర్నేని నవీన్, రవి శ్రీ తేజ్ ను పరామర్శించేందుకు కిమ్స్ కి చేరుకున్నారు..ఇక నిర్మాతలు యెర్నేని నవీన్, రవి.. మంత్రి సమక్షంలో 50 లక్షల చెక్ నీ బాధిత కుటుంబానికి అందజేశారు. ప్రస్తుతం శ్రీ తేజ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *