టాలీవుడ్ ప్రముఖ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తన లేటెస్ట్ చిత్రం “పుష్ప 2” విషయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో అల్లు అర్జున్ జైలుకి వెళ్లి బెయిల్ మీద వెంటనే బయటకి కూడా రావడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి మళ్ళీ పోలీసు వారు నోటీసులు ఇచ్చినట్టుగా ఇపుడు తెలుస్తుంది. రేపు డిసెంబర్ 24 ఉదయం 11 గంటలకి స్టేషన్ కి రావాలని నోటీసులు ఇచ్చారట.
అయితే ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ రీసెంట్ గా నిర్వహించిన ప్రెస్ మీట్ కారణంగా ఈ నోటీసులు వెళ్లినట్టుగా సమాచారం. మరి ఇప్పటికే బన్నీ మధ్యంతర బెయిల్ మీద బయటకి రాగా ఇది ప్రస్తుతానికి నాలుగు వారాల గడువుతో వచ్చింది. కానీ మళ్ళీ ఇంతలోనే తనని మళ్ళీ నోటీసులు పంపి రమ్మనడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మరి ఈ కేసులో అల్లు అర్జున్ వైపు ఎలాంటి తీర్పు ఫైనల్ గా వస్తుందో చూడాలి.
The post అల్లు అర్జున్ కి పోలీసులు నోటీసులు.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.