Published on Dec 24, 2024 12:53 AM IST
కన్నడ వినూత్న చిత్రాల దర్శకుడు అలాగే నటుడు రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “యూఐ”. చాలా కాలం విరామం తర్వాత తన దర్శకత్వంలోనే వచ్చిన ఈ చిత్రం డే 1 నుంచే సాలిడ్ బుకింగ్స్ తో దూసుకెళ్తుంది. అటు కన్నడతో పాటుగా తెలుగులో కూడా మంచి ఆదరణ అందుకున్న ఈ చిత్రం స్టడీగా దూసుకెళ్తుంది.
మరి లేటెస్ట్ గా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ లో కన్నడ సూపర్ స్టార్స్ కలిసి కనిపించడం ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది. మరి కన్నడ హీరోలు కిచ్చా సుదీప్ అలాగే రాకింగ్ స్టార్ యష్ లు యూఐ సెలెబ్రెటీ స్పెషల్ స్క్రీనింగ్ లో ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు. దీనితో ఈ పిక్స్ ఇపుడు వైరల్ గా మారాయి. మరి ఈ వారంలో సుదీప్ నటించిన మాక్స్ చిత్రం రిలీజ్ కి రాబోతుండగా యష్ టాక్సిక్ అనే భారీ సినిమాలో బిజీగా ఉన్నాడు.