ప్లాప్ దిశగా రీసెంట్ సౌత్ సీక్వెల్!? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

లేటెస్ట్ గా మన దక్షిణాది సినిమా నుంచి వచ్చిన సాలిడ్ చిత్రాల్లో పలు అవైటెడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఎక్కడి వరకో కాకుండా ఈ డిసెంబర్ నెల లోనే పలు క్రేజీ సీక్వెల్ చిత్రాలు కూడా వచ్చాయి. మరి ఆ చిత్రాలే మన టాలీవుడ్ నుంచి భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం పుష్ప 2 అలాగే కోలీవుడ్ సినిమా నుంచి “విడుదల 2”. అయితే ఈ రెండిట్లో ఒకటి మాత్రం ప్లాప్ గానే మిగిలిపోయేలా ఉందట.

మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 భారీ వసూళ్లు అందుకుంటుంది. కానీ విజయ్ సేతుపతి వెట్రిమారన్ ల కలయికలో వచ్చిన విడుదల 2 మాత్రం నష్టాలే చూసేలా ఉందట. తెలుగులో కూడా అంత మంచి టాక్ ని తెచ్చుకోని ఈ చిత్రం తమిళ్ లో కూడా భారీగా డ్రాప్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో ఎంతో కాలం నుంచి తీసిన ఈ సినిమా సరైన స్పందన అందుకోలేకపోయింది అని చెప్పాలి.

The post ప్లాప్ దిశగా రీసెంట్ సౌత్ సీక్వెల్!? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *