ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుండి పుష్ప -2 రికార్డుల రపరప మొదలు పెట్టింది.
ఒకవైపు వసూళ్లు పరంగా సెన్సేషన్ చేస్తున్న పుష్ప టికెట్స్ బుకింగ్స్ లోను టికెట్స్ పరంగాను ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్ మై షోలో పుష్ప -2 ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది. ఇప్పటి వరకు అత్యధిక టికెట్స్ బుక్ అయిన సినిమాగా కన్నడ స్టార్ హీరో యష్ నటించిన KGF -2 సినిమా 17.01 మిలియన్స్ బుకింగ్స్ తో టాప్ – 1 లో కొనసాగుతుండగా, ప్రభాస్ బాహుబలి -2, RRR రెండు మూడు ప్లేస్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలను అధిగమించి పుష్ప ఇప్పుడు నంబర్ -1 స్తానం చేరుకుంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన పుష్ప కేవలం 17 రోజుల్లోనే 17.27 మిలియన్స్ తో కెజిఎఫ్ ను వెనక్కునెట్టి మొదటి ప్లేస్ ఆక్రమించాడు పుష్ప రాజ్. ఇక మూడవ వీకెండ్ లో సూపర్ బుకింగ్స్ రాబట్టి మొత్తంగా 18 మిలియన్ బుకింగ్స్ తో ఎవరు టచ్ చేయలేని రికార్డును సెట్ చేసాడు పుష్ప. ఇప్పట్లో ఈ సినిమా రికార్డును బ్రేక్ చేయలేరని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించిన ఈ సినిమా బుకింగ్స్ రికార్డును ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.