Live Now
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌కు పోలీస్ నోటీసులు..
- ఈరోజు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్..
- పోలీస్ విచారణను అల్లు అర్జున్ ఎలా ఎదుర్కొంటారనే దానిపై ఉత్కంఠత..
Allu Arjun Live Updates: పుష్ప -2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని అందులో తెలిపారు. అయితే, పోలీసులు నోటీసులు ఇవ్వడంతో అల్లు అర్జున్ తన లీగల్ టీమ్‌తో సుధీర్ఘ చర్చ జరిపి.. పోలీస్ విచారణలో ఏ విధంగా వ్యవహరించాలో సూచనలు తీసుకున్నారు. ఇక, నేటి విచారణను అల్లు అర్జున్ ఎలా ఎదుర్కొంటారనే దానిపై ఉత్కంఠత కొనసాగుతుంది. మీ కోసం ఎన్టీవీ లైవ్ అప్డేట్స్..