NTR – Prashanth Neel : ‘డ్రాగ‌న్’ స్టోరీని  తెస్తున్న ఎన్టీఆర్-నీల్.. చైనాను గట్టిగానే టార్గెట్ చేసినట్టున్నారుగా ?

NTR – Prashanth Neel : కేజీఎఫ్ సిరీస్ తో భారీ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ తన ప్రయోగాలను కాసుల తుఫానుగా మార్చాడు. కేజీఎఫ్ 2 చిత్రం ఏకంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరాక అత‌డి రేంజ్ అమాంతం ఆకాశాన్ని తాకింది. ఆ త‌ర్వాత పాన్ ఇండియ‌న్ స్టార్ ప్రభాస్ తో స‌లార్ 1 తీశారు. స‌లార్1 బాక్సాఫీస్ వ‌ద్ద సుమారు 700కోట్లు వ‌సూలు చేసింది. దీంతో స‌లార్ 2పైనా భారీ అంచానాలే ఉన్నాయి. ఈ స‌మ‌యంలో ప్రశాంత్ నీల్ ఇద్ద‌రు అగ్ర హీరోల కోసం ఒకేసారి రెండు సినిమాల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడని, నెక్ట్స్ లెవ‌ల్ స్క్రిప్టుల‌ను రెడీ చేస్తున్నాడ‌ని వార్తలు వినిపిస్తు్న్నాయి. ప్ర‌భాస్ తో స‌లార్ 2 చేయాల్సి ఉండ‌గా, ఇదే స‌మ‌యంలో ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ కోసం నీల్ సీరియ‌స్ గా క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. య‌ష్‌, ప్రభాస్ ల‌తో భారీ ప్రయోగం చేసిన‌ట్టే ఇప్పుడు ఎన్టీఆర్ తోను అత‌డు ప్రయోగం చేయ‌బోతున్నాడు. ఈ సినిమాని ఇప్పటికే అధికారికంగా లాంచ్ చేసినందున ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో తార‌క్ తో అత‌డు చేయ‌బోయే ప్రయోగం ఎలా ఉండబోతుందన్న ఆరాలు మొదలయ్యాయి.

Read Also:AlluArjun : చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్..

తాజా స‌మాచారం మేర‌కు.. ఈ సినిమా క‌థ‌కు బంగ్లాదేశ్ కు, డ్రాగ‌న్ దేశం చైనాతోను క‌నెక్షన్ ఉంటుంద‌ని స‌మాచారం. బంగ్లాదేశ్ లో స‌మస్యలు ఎదుర్కొనే తెలుగువారిని ర‌క్షించే `డ్రాగ‌న్` స్టోరీని అత‌డు తెర‌పైకి తెస్తున్నాడు. డ్రాగ‌న్ ఎన్టీఆర్ పాత్రను మ‌రో లెవ‌ల్లో ఎలివేట్ చేయ‌బోతోంది. ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళ్లి పోరాడే తెలుగు వాడు డ్రాగ‌న్. బంగ్లాదేశ్‌లో సవాళ్లను ఎదుర్కొంటున్న తెలుగు ప్రజలకు రక్షకుడిగా జూనియర్ ఎన్టీఆర్ పాత్రను చిత్రీకరిస్తూ, వలసదారుల చుట్టూ ఈ చిత్రం క‌థాంశం న‌డుస్తుంద‌ని రివీలైంది. ఈ చిత్రం పౌరాణిక డ్రామాతో న‌డ‌వ‌క‌పోయినా… ఫిక్ష‌న‌లైజ్డ్ హిస్టారిక‌ల్ పాత్ర‌ల‌తో ర‌క్తి క‌ట్టించ‌నున్నట్లు తెలుస్తోంది. డ్రాగ‌న్ అనేది చైనా సంస్కృతిలో ఒక భాగం. అందువ‌ల్ల అక్కడి ప్రేక్షకులకు నచ్చే టైటిల్ ఇది అని కూడా విశ్లేషిస్తున్నారు.

Read Also:ViduthalaiPart2 : ఫస్ట్ పార్ట్ హిట్.. భారీ నష్టాలను మిగిల్చుతున్న విడుదల 2

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *